సూరా Al-Fatihah — The Opening

సూరా Al-Fatihah (The Opening) — 1/114 · 7 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో

Ayah 1

ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు

Ayah 2

ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత

Ayah 3

مَٰلِكِ يَوۡمِ ٱلدِّينِ

తీర్పుదినానికి స్వామి

Ayah 4

إِيَّاكَ نَعۡبُدُ وَإِيَّاكَ نَسۡتَعِينُ

మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము

Ayah 5

ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ

మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి

Ayah 6

صِرَٰطَ ٱلَّذِينَ أَنۡعَمۡتَ عَلَيۡهِمۡ غَيۡرِ ٱلۡمَغۡضُوبِ عَلَيۡهِمۡ وَلَا ٱلضَّآلِّينَ

నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు

Ayah 7