సూరా Al-Maa'un — Almsgiving

సూరా Al-Maa'un (Almsgiving) — 107/114 · 7 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ

తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా

Ayah 1

فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ

అతడే అనాథులను కసరి కొట్టేవాడు

Ayah 2

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ

మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు

Ayah 3

فَوَيۡلࣱ لِّلۡمُصَلِّينَ

కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు

Ayah 4

ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ

ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో

Ayah 5

ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ

ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)

Ayah 6

وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ

మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో

Ayah 7