సూరా Al-Humaza — The Traducer

సూరా Al-Humaza (The Traducer) — 104/114 · 9 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

وَيۡلࣱ لِّكُلِّ هُمَزَةࣲ لُّمَزَةٍ

అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు

Ayah 1

ٱلَّذِي جَمَعَ مَالࣰ ا وَعَدَّدَهُۥ

ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో

Ayah 2

يَحۡسَبُ أَنَّ مَالَهُۥٓ أَخۡلَدَهُۥ

తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు

Ayah 3

كَلَّاۖ لَيُنۢبَذَنَّ فِي ٱلۡحُطَمَةِ

ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు

Ayah 4

وَمَآ أَدۡرَىٰكَ مَا ٱلۡحُطَمَةُ

ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా

Ayah 5

نَارُ ٱللَّهِ ٱلۡمُوقَدَةُ

అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని

Ayah 6

ٱلَّتِي تَطَّلِعُ عَلَى ٱلۡأَفۡـِٔدَةِ

అది గుండెల దాకా చేరుకుంటుంది

Ayah 7

إِنَّهَا عَلَيۡهِم مُّؤۡصَدَةࣱ‏

నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది

Ayah 8

فِي عَمَدࣲ مُّمَدَّدَةِۭ

పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే

Ayah 9