సూరా Az-Zalzala — The Earthquake

సూరా Az-Zalzala (The Earthquake) — 99/114 · 8 ఆయతులు. అరబిక్ పాఠం మరియు తెలుగు అనువాదంతో చదవండి, వినండి.

إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا

భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు

Ayah 1

وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا

మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు

Ayah 2

وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا

మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు

Ayah 3

يَوۡمَئِذࣲ تُحَدِّثُ أَخۡبَارَهَا

ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది

Ayah 4

بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا

ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు

Ayah 5

يَوۡمَئِذࣲ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتࣰ ا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ

ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు

Ayah 6

فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرࣰ ا يَرَهُۥ

అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు

Ayah 7

وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةࣲ شَرࣰّ ا يَرَهُۥ

మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు

Ayah 8